Home
 / 
అంతర్జాతీయం / కరోనా ఓడిపోయింది.....

కరోనా ఓడిపోయింది.. మ్యాచ్ గెలిచింది.. స్టేడియంలో 30 వేల మంది ప్రేక్షకులు..

కరోనా ఓడిపోయింది.. మ్యాచ్ గెలిచింది.. స్టేడియంలో 30 వేల మంది ప్రేక్షకులు..
X

కరోనా మహమ్మారి భయంతో సామాజిక దూరం కచ్చితంగా పాటించాలి అని ప్రపంచమంతా మొత్తుకుంటుంటే వియత్నాం మాత్రం ఏకంగా స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాటు చేసింది. ఎంత ధైర్యం అని అనుకున్నా కరోనా కట్టడికి చిన్న దేశమైనా ముందు జాగ్రత్తగా అప్రమత్తమవడంతో పాటు సరిహద్దు రాకపోకలను నిలిపి వేసింది. అంతర్జాతీయ విమానాలను దేశంలోకి అడుగు పెట్టనివ్వలేదు. కేవలం 328 పాజిటివ్ కేసులతో బయటపడింది. ఒక్క మరణాన్ని తన ఖాతాలో వేసుకోలేదు దాదాపు 10 కోట్ల జనాభా ఉన్న వియత్నాం.

చైనాతో పొడవైన సరిహద్దు రేఖను కలిగి ఉన్న వియత్నాం నామ్ దిన్ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ నిర్వహించింది. ఈ మ్యాచ్ ని ప్రత్యక్షంగా తిలకించేందుకు 30 వేల మంది అభిమానులు హాజరయ్యారు. సామాజిక దూరం కాదు కదా కరోనా విషయమే మర్చిపోయి ఆద్యంతం మ్యాచ్ ను ఆస్వాదించారు. ఈలలు, చప్పట్లతో తమ ఆటగాళ్లను ఎంకరేజ్ చేసి మ్యాచ్ గెలిపించారు. వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా ధర్మల్ స్క్రీనింగ్ లు ఏర్పాటు చేశారు. హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.

ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకునేలా చూశారు. మ్యాచ్ అనంతరం వియత్నాం టీమ్ కెప్టెన్ క్యూహాయ్ మాట్లాడుతూ స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోవడం ఆనందాన్ని కలిగించిందన్నారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో వియత్నాం విజయవంతమైందని, అందుకే తమ ఫుట్ బాల్ ఆట మళ్లీ ప్రారంభమైందని తెలిపాడు. స్టేడియంకు వేల సంఖ్యలో అభిమానులను అనుమతించి కరోనా ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నామనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.

Next Story