సెప్టెంబరు కల్లా వ్యాక్సిన్.. ఒక్క భారత్ లోనే 100 కోట్లు..

సెప్టెంబరు కల్లా వ్యాక్సిన్.. ఒక్క భారత్ లోనే 100 కోట్లు..

కోవిడ్ కట్టడికి వ్యాక్సిన్ వచ్చేస్తుందంటూ పలు దేశాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ వర్సిటీ అభివృద్ధి చేస్తున్న కోవిడ్ 19 ప్రయోగాత్మక వ్యాక్సిన్ (ఏజెడ్ డీ 1222)ను సెప్టెంబర్ కల్లా 200 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని బ్రిటీష్ ఫార్మా కంపెనీ ఆస్టాజెనెకా ప్రకటించింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాస్కల్ సోరియట్ బీబీసీ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆగస్ట్ చివరి నాటికి వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తవుతాయని అన్నారు. సెప్టెంబరు కల్లా వీటి పని తీరుపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు.

ఈ సంస్థ బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తో రూ.5,600 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత డోసుల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. భారత్ లోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఈ సంస్థతో భాగస్వామ్యం నెరపుతోంది. తామూ వ్యాక్సిన్ తయారీ కోసం రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. దీంతో ఆస్టాజెనెకా భాగస్వామ్యంతో సీరం ఇనిస్టిట్యూట్ 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయనుంది. మరో వైపు బ్రెజిల్ దేశం కూడా వ్యాక్సిన్ విషయంలో పురోగతి సాధించింది. జూన్ చివరి నాటికి వ్యాక్సిన్ ట్రయల్స్ వేయడానికి రంగం సిద్ధం చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story