అందరూ లాక్‌డౌన్ స్పిరిట్ కొనసాగించాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అందరూ లాక్‌డౌన్ స్పిరిట్ కొనసాగించాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోందని.. అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చినప్పటికీ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లాక్‌డౌన్ స్పిరిట్‌ను కొనసాగించాలని ఆయన చెప్పారు. నివాస ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన సూచించారు. ఎక్కడికెళ్లినా మాస్కును తప్పనిసరిగా పాటించాలని కిషన్ రెడ్డి కోరారు.

కరోనా నియంత్రణ కోసం మరో మూడు కొత్త పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొవిడ్ బీప్, బయో సెన్సార్ ల్యాబొరేటరీ, ర్యాపిడ్ టెస్ట్ ఫర్ కొవిడ్ అనే పరికరాలు దేశంలోనే మొదటిసారి హైదరాబాద్‌లోని ESI హాస్పిటల్‌లో అందుబాటులోకి వచ్చాయి. వీటిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి.. మరో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో కలిసి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ మూడు యంత్రాలను ESIC అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌లోని ECIL, ఆటమిక్ ఎనర్జీ సంస్థతో కలిసి ఈ డివైస్‌లను ESIC తయారు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story