ధర పెరిగినా పాత రేటుకే బంగారం..

ధర పెరిగినా పాత రేటుకే బంగారం..
X

ఎక్కడో చెబితే మేం కూడా వెళ్లి కొనేసుకుంటామంటారా.. అందరికీ కాదులెండి..ఆల్ రెడీ వస్తువు ఆర్డర్ ఇచ్చి కొంత సొమ్ము జ్యువెలరీ షాపు యజమానికి ఇచ్చిన వారికే ఈ అవకాశం. అనుకోకుండా లాక్డౌన్ వచ్చి పడింది. మరి అంతకు ముందే ఆభరణాల కొనుగోలు చేయాలనుకున్నవారు వారి కావలసిన వస్తువుల తయారీకి డబ్బు చెల్లించి ఉన్నారు. అప్పుడేమో రేటు కొంత తక్కువ వుంది. రెండు నెలల అనంతరం రేటు పెరిగింది. దాంతో పాత రేటుకే కొనుగోలు దారులకు సొమ్ములు ఇవ్వాలి.

అప్పుడు పది గ్రాముల బంగారం ధర రూ.39 వేలు ఉంటే ఊహించని విధంగా 65 రోజుల అనంతరం గ్రాముకు రూ.700 పెరిగింది. దాదాపు 80 గ్రాముల వస్తువులకు ఆర్డర్ ఇచ్చిన వారికి రూ.56 వేలు కలిసి వచ్చింది. ఆంద్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దాదాపు 150 బంగారు నగల దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ పెళ్లిళ్ల సీజన్ లో రోజుకి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఆర్డర్ ఇచ్చిన వెంటనే వినియోగ దారుడు కొంత మొత్తం చెల్లిస్తాడు. దాంతో వస్తువు తీసుకునేటప్పుడు ధర పెరిగినా అతడికి సంబంధం ఉండదు. అదే ఇప్పుడు లాక్ డౌన్ ముందు ఆర్డర్ ఇచ్చిన వారికి కూడా కలిసొచ్చింది.

Tags

Next Story