95 శాతం కేసుల్లో వ్యాధి లక్షణాల్లేవ్.. అయినా కరోనా: గోవా ఆరోగ్య శాఖ మంత్రి

కరోనా వైరస్ కి కొంచెం కూడా కనికరం లేనట్టుంది. లక్షణాలేవీ కనిపించకుండానే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవుతోంది. అదృష్టం వుంటే కోలుకుంటున్నారు. లేదంటే అంతే సంగతులు. గోవాలో ఇప్పటి వరకు నమోదైన కేసుల పరిస్థితి చూస్తే ఈ విషయం స్ఫష్ట మవుతుంది. కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 95 శాతం మంది రోగులకు వ్యాధి లక్షణాలు కనిపించలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఎంత మందికి వ్యాధి లక్షణాలు లేవు.. ఎంత మందికి కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయన్న దానిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు ఆరోగ్య శాఖ కార్యదర్శి నీలా మోహన్ వెల్లడించారు. రాష్ట్రంలోని ఏకైక కంటైన్మెంట్ ప్రాంతమైన మంగోర్ లో వ్యాధి లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా, పెద్దా చిన్నా తేడా లేకుండా అందరికీ కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. గర్భిణీలు, వృద్ధులకు కూడా కరోనా టెస్టులు చేస్తామన్నారు. కాగా, గోవాలోని ఒక్క మంగోర్ ప్రాంతంలోనే 235 యాక్టివ్ కేసులు ఉండడం అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com