అవునా.. ఆగస్ట్ లోనే కరోనా!!

అవునా.. ఆగస్ట్ లోనే కరోనా!!

నిన్నటి వరకు డిసెంబర్ లో కరోనా లక్షణాలతో ఉన్న వ్యక్తి ఆస్పత్రికి వస్తే న్యుమోనియా అనుకున్నాం. జనవరిలో అది కరోనా అని తెలిసింది అని చైనా చెప్పుకొచ్చింది. కానీ హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం ప్రకారం కరోనా వైరస్ చైనాలో ఆగస్ట్ లోనే వ్యాపించిందని, అయితే వారికి దాని గురించి అవగాహన లేక అంతగా పట్టించుకోలేదని తెలిపారు. అదే వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోందని అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఆగస్ట్ లో తీసిన సాటిలైట్ ఫోటోల ఆధారంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

ఆగస్ట్ లో వూహన్ లోని ఆస్పత్రులన్నీ దగ్గు, జలుబు, విరోచనాలు వంటి లక్షణాలున్న రోగులతో క్రిక్కిరిసి పోయాయి. ఆ సమయంలో గూగుల్ సెర్చి ఇంజన్ లో కరోనా లక్షణాల గురించి వెతికారని పేర్కొంది. దీంతో అప్పుడే వైరస్ వ్యాప్తి ప్రారంభమైందని అభిప్రాయపడింది. ఊహాన్ మార్కెట్లో కరోనాను గుర్తించే సమయానికి ముందే అది ఉనికిలో ఉందన్న వాదనకు మా ఆధారాలు మద్దతిస్తున్నాయని పేర్కొంది. కాగా చైనాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు 83,040 అయితే 78,341 మంది చికిత్స తీసుకుని కోలుకున్నారు. కరోనా గురించి తెలిసిన వెంటనే వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయగలిగింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కుని మిగిలిన దేశాలకు ఆదర్శంగా నిలిచింది. కేసులు ఊహించినంతగా లేకపోవడం ఊరట కలిగించే అంశమే మరి.

Tags

Read MoreRead Less
Next Story