కరోనా వ్యాప్తిపై తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టిన ట్విటర్

కరోనా వ్యాప్తిపై తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టిన ట్విటర్

కరోనా వ్యాప్తిపై ప్రచారంలో ఉన్న తప్పుడు వార్తలకు ట్విటర్ చెక్ పెట్టింది. 5జీ టెక్నాలజీ ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోందని వస్తున్న వార్తలకు అడ్డుకట్టవేసింది. అయితే, ఈ వార్తలను తొలగించకుండా.. ఫ్యాక్ట్ చెక్ మెసెజ్ లను దానికి జోడించింది. కోవిడ్ 19 పై నిజాలు తెలుసుకోండి అనే లింగ్ ఎంబెడెడ్ ను ట్యాగ్‌ను ట్విటర్ తగిలించింది. దీన్ని క్లిక్ చేస్తే.. 5జీ టెక్నాలజీతో కరోనా రాదు’ అనే ఫ్యాక్ట్‌ చెక్‌ పేజీ ఓపెన్‌ అవుతోంది. ఈ పేజీలో 5జీకి కరోనాకు సంబంధంలేదని చూపించే పలు మీడియా కథనాలు అందుబాటులో ఉంటాయి.

కాగా, 5జీ టెక్నాలజీతో కరోనా ఒకరి నుంచి మరొకరి సంక్రమిస్తుందని ఇటీవల బాగా ప్రచారం జరిగింది. ఈ టెక్నాలజీ వాడటం ద్వారా.. దీనికి సంబందించిన తరంగాలు మనిషిలో వ్యాధి నిరోధక శక్తిని బలహీన పరుస్తాయని వైరల్ గా మారాయి. ఈ వార్తలకు బయపడి బ్రిటన్ లో ని సెల్ ఫోన్ టవర్లను కూడా ద్వంసం చేశారు. దీంతో ఫ్యాక్ట్ చెక్ ద్వారా ట్విటర్ ఈ విషయంపై క్లారటీ ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story