కరోనా పరీక్ష నివేదికతో హాజరుకావాలి.. తబ్లిగీ జమాత్ చీఫ్‌కు ఢిల్లీ పోలీసుల ఆదేశం

కరోనా పరీక్ష నివేదికతో హాజరుకావాలి.. తబ్లిగీ జమాత్ చీఫ్‌కు ఢిల్లీ పోలీసుల ఆదేశం
X

తబ్లీగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కు కరోనా నెగిటివ్ వచ్చినట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్ష చేసుకున్న రిపోర్టు చూపించాలని ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. ఈ మేకరు మౌలానా సాద్ కు ఢిల్లీపోలీసులు నోటీసులు జారీ చేశారు. కరోనా వ్యాప్తికి తబ్లీగీ జమాత్ సమావేశం కారణమంటూ ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో.. జమాత్ సభ్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. విచారణకు హాజరుకావాలని మౌలానా సాద్ కు పలు సార్లు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో ఆయన విచారణకు సహకరిస్తారని.. తబ్లీగ్ జమాత్ అధికార ప్రతినిథి షాహిద్ అలీ చెప్పారు. అయితే, దర్యాప్తు చేసేందుకు వీలుగా ఆయన కరోనా పరీక్ష నివేదికతో తమ ముందు హాజరుకావలని పోలీసులు తెలిపారు. ప్రైవేట్ లాబరేటరీలో పరీక్ష చేయించుకున్న నివేదిక వచ్చిందని.. కానీ, ప్రభుత్వ లాబరేటరీలో చేయించుకున్న నివేదిక రాలేదని పోలీసులు మౌలానా సాద్ కు తెలిపారు.

Tags

Next Story