బాలయ్య బాబుకు బర్త్ డే విషెస్.. నటనలో, ప్రజాసేవలో మీకు మీరే సాటి: చంద్రబాబు

బాలయ్య బాబుకు బర్త్ డే విషెస్.. నటనలో, ప్రజాసేవలో మీకు మీరే సాటి: చంద్రబాబు

నందమూరి నట వారసుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి బాలకృష్ణ ఈ రోజు తన పుట్టిన రోజును కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటున్నారు. బాలయ్య 60వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సహ నటులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

నటనైనా, ప్రజాసేవ అయినా.. చేసే పనిలో నూటికి నూరుపాళ్లు నిబద్ధతతో ఉండే వ్యక్తి బాలకృష్ణగారు. అందుకే ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలకృష్ణగారు అరవై వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంలో ఆయనకు షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు అని నారా చంద్రబాబు నాయుడు బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

60లో అడుగు పెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో, ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను అని చిరంజీవి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story