కార్యాలయాల్లో కలిసి కూర్చొని తినొద్దు: ఎయిమ్స్ డైరెక్టర్

ఆఫీస్ క్యాంటీన్లో రెండు టేబుళ్లు ఆక్యుపై చేసి ఓ పది మంది కలిసి తినే వాళ్లం ఇదివరకటి రోజుల్లో అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా మహమ్మారి వచ్చి కలిసి కూర్చొని తినడానికి తిలోదకాలు ఇచ్చింది. కార్యాలయాల్లో పని చేసే వారు కలిసి కూర్చొని తినొద్దని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా చెప్పారు. కొన్ని నెలల పాటు ఒంటరిగానే తినడం అలవాటు చేసుకోమంటున్నారు. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని అన్నారు. కార్యాలయాల్లో పరిశుభ్ర వాతావరణం ఉండాలని, శానిటైజేషన్ క్రమం తప్పక జరగాలని అన్నారు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా కరోనా వ్యాపిస్తుందని అన్నారు.
కంటైన్మెంట్ జోన్లలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి కచ్చితంగా చేయాలని సూచించారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్ తయారీపై కృషి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుందని అన్నారు. ఎప్పుడు వస్తుంది అనేది సరిగ్గా అంచనా వేయలేకపోతున్నామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com