కేజ్రీవాల్‌కు కరోనా నెగెటివ్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్ కు వెళ్లారు. జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న ఆయన కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన తన కార్యక్రమాలన్ని రద్దుచేసుకొని ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్ కు వెళ్లారు. సోమవారం నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు వైరస్ సోకలేదని తేలింది. కాగా, పరీక్షల నివేదికలో నెగెటివ్‌గా తేలడంతో కేజ్రీవాల్ ఊపిరిపీల్చుకొన్నారు.
ఆదివారం నుంచి మంత్రులతోగానీ, ఆధికారులతోగానీ కేజ్రీవాల్ కలువలేదు. గొంతునొప్పి కారణంగా ఎవరితో మాట్లాడలేదు. ‘సీఎం ఆరోగ్యం బాగాలేదని, స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్నారని’ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సోమవారం వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, సామాజిక వ్యాప్తి, ప్రైవేట్ హాస్పిటల్‌పై చర్చించడానికి మనీశ్ సిసోడియా నేతృత్వంలో మంత్రిమండలి సమావేశం జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

