పది పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తాం: విద్యాశాఖ

పది పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తాం: విద్యాశాఖ
X

ముందు చెప్పిన షెడ్యూల్ ప్రకారమే పదవతరగతి పరీక్షలు నిర్వహిస్తాము. అందులో ఎలాంటి ఆలోచనకూ తావులేదు అని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్ అన్నారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పది పబ్లిక్ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఏపీలో కూడా పరీక్షలు నిర్వహించరేమో అని విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కూడా పరీక్షలు రద్దు చేస్తారన్న ప్రచారం జరగుతోంది. వీటన్నింటికీ చెక్ పెడుతూ మంత్రి తేల్చి చెప్పారు. పటిష్ట భద్రతా చర్యల నడుమ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. అనవసరమైన ప్రచారాలతో విద్యార్థులను గందరగోళానికి గురిచేయవద్దని అన్నారు. ముందు నిర్ణయించిన డేట్ ప్రకారం జులై 10 నుంచి పరీక్షలు జరుగుతాయి. అయితే రెండు పేపర్లని ఒక పేపర్ కు కుదించి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు.

Tags

Next Story