బిగ్ బి.. బిగ్ హార్ట్.. వలస కార్మికులకు బిగ్ హెల్ప్

బిగ్ బి.. బిగ్ హార్ట్.. వలస కార్మికులకు బిగ్ హెల్ప్

కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఎక్కవగా ఇబ్బందులు ఎదుర్కొన్నది వలసకార్మికులే. వారిని సొంత ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వాలతో పాటు చాలా మంది వ్యక్తిగత బాధ్యతగా తీసుకొని వారికి తోచిన సాయం చేసారు. ఇప్పుడు ఆ జాబితాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేరారు. పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న దాదాపు 500 మందికోసం మూడు విమానాల్లో తరలించేందుకు.. వారికి టికెట్లు బుక్ చేశారు. ఈ విషయాన్ని ఆయనకు బాగా కావలసిన వారు తెలిపారు. అమితాబ్ కు పెద్దగా పబ్లిషిటీ ఇష్టం ఉండదని.. ఏ సాయం చేసిన ఎవరికీ తెలియకూడదని బావిస్తారని బిగ్ బీతో బాగా సన్నితంగా ఉండేవారు తెలిపారు. వలస కార్మికుల కష్టాలు చూసి వారికి ఏదైనా చేయాలని అనుకున్నారని.. వారణాసికి 180 మంది వలస కార్మికులను ఇండిగో విమానంలో బుధవారం ఉదయం తరలించారని.. ఇలా మొత్తం 500 మందిని తరలించారని అమితాబ్ స్నేహితులు తెలపారు.

వారణాసితో పాటు పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలురాష్ట్రాలకు వలస కార్మకులను తరలించేందుకు ఆయన ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. ఇటీవల ముంబై నుంచి పది బస్సుల్లో కూడా వలస కార్మికులను తరలించారని తెలిపారు.

కాగా, బాలీవుడ్ నటుడు సోనూసూద్ లక్షల మంది వలస కార్మికులను సొంత ప్రాంతాలకు తరలించిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story