గ్రేటర్ హైదరాబాద్ లో భారీగా పెరిగిన కేసులు.. పది రోజుల్లో..

గ్రేటర్ హైదరాబాద్ లో భారీగా పెరిగిన కేసులు.. పది రోజుల్లో..

నగరంలో కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉంది. బుధవారం 143మందికి వైరస్ సోకినట్లు వైద్యాధికారులు ప్రకటించారు. జూన్ నెల పది రోజుల్లోనే 1,053 మందికి కరోనా సోకింది. పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో వైద్యులు, జర్నలిస్టులు వైరస్ బారిన పడుతున్నారు. రానున్న రోజుల్లో వైరస్ వ్యాప్తిని అంచనా వేయలేకపోతున్నారు అధికారులు. వర్షాకాలంలో వైరస్ లు విజృంభిస్తాయి. కరోనా తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే జులై చివరి నాటికి కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం అభిప్రాయపడింది.

Tags

Read MoreRead Less
Next Story