మాజీ క్రికెటర్ హత్య.. మద్యం మత్తులో తండ్రిని..

మాజీ క్రికెటర్ హత్య.. మద్యం మత్తులో తండ్రిని..
X

కేరళ మాజీ క్రికెటర్ కె. జయయమోహన్ తంపి గత వారం తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. మద్యం మత్తులో ఆయన కుమారుడే తండ్రిని చంపేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. జయమోహన్ కేరళ తరపున ఆరు రంజీ ట్రోఫీ మ్యాచ్ లు ఆడారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ డిప్యూటీ జనరల్ మేనజర్ గా పదవీ విరమణ చేశారు. భార్య కొన్ని సంవత్సరాల క్రితమే కన్నుమూశారు. జీవిత భాగస్వామి మరణం ఆయనను తీవ్ర నిరాశకు గురి చేసిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆయన కొడుకుతో కలిసి జీవిస్తున్నారు.

కొడుకు అశ్విన్ కేరళ రాజధాని తిరువనంతపురంలో చెఫ్ గా పని చేస్తున్నాడు. తండ్రీ కొడుకులిద్దరికీ ఇంట్లోనే కలిసి మద్యం తాగే అలవాటు ఉంది. జయమోహన్ హత్యకు గురైన రోజు శనివారం కూడా వారు మద్యం సేవించారు. మరింత మద్యం కోసం తండ్రిని డెబిట్ కార్డు అడిగాడు. దానికి ఆయన ఇవ్వనన్నారు. దాంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో అశ్విన్ తండ్రిని బలంగా తోసేయడంతో క్రిందపడ్డ జయమోహన్ కి తలకు తీవ్రంగా గాయమై అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అశ్విన్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Tags

Next Story