ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదుల చేత రాజీనామా చేయించడం దారుణం : అయ్యన్న పాత్రుడు

X
జగన్ సర్కారు తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. రాష్ట్రంలో రౌడీ పాలన నడుస్తోందన్నారు. ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడుకోవద్దు అనే విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ముగ్గురు ప్రభుత్వ
న్యాయవాదుల చేత రాజీనామా చేయించడం దారుణమైన విషయమని అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏడాది కాలంలో 70 సార్లు కోర్టుల్లో ఓటమిపాలైన జగన్.. సిగ్గుంటే రాజీనామా చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
