సికింద్రాబాద్‌లో రైల్వే ఉద్యోగికి కరోనా పాజిటివ్

సికింద్రాబాద్‌లో రైల్వే ఉద్యోగికి కరోనా పాజిటివ్
X

సికింద్రాబాద్‌లో ఓ రైల్వే ఉద్యోగికి కరోనా సోకింది. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో హైదరాబాద్ భవన్‌లోని పరిపాలనా విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు గురువారం తెలిపారు. దీంతో హైదరాబాద్ భవన్‌ను నాలుగు రోజులు పాటు మూసివేస్తున్న అధికారులు తెలిపారు. పూర్తిగా శానిటైజ్ చేసిన తరువాత మళ్లీ సోమవారం నుంచి కార్యక్రమాలు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. అయితే, నిరంతరం కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Tags

Next Story