కరోనా మరణాల జాబితాలో భారత్ స్థానం ఎంతంటే?

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోజుకు దాదాపు 10 వేల చొప్పున కేసులు వస్తున్నాయి. ఇప్పటికే బాధితుల సంఖ్య 2 లక్షల 88 వేలు దాటే సింది. వైరస్ బారిన పడి 8 వేల 120 మందికి పైగా చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసుల జాబితాలో భారత్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. కరోనా మరణాల జాబితాలో మనదేశం కెనెడాను దాటి 11వ స్థానానికి చేరింది. కేసులు, మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది. మొత్తం బాధితుల్లో 51 శాతం మందికి పైగా కోలుకుంటున్నారు. యాక్టివ్ కేసులు లక్ష 39 వేలు ఉంటే, డిశ్చార్జ్ కేసుల సంఖ్య లక్ష 41 వేలుగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కంటే డిశ్చార్జ్ కేసుల సంఖ్య 2 వేలు ఎక్కువగా ఉంది. రికవరీలో మనదేశం తొమ్మిదో స్థానానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా 20 శాతం మంది మాత్రమే ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతు్నారు. ఐదు శాతం మంది రోగులకే ఐసీయూ చికిత్స అవసరమవుతోంది.
దేశంలోని మొత్తం కేసుల్లో మూడింట ఒక వంతు కేసులు జూన్‌లోనే నమోదయ్యాయి. జూన్ ఒకటి నుంచి పదో తేదీ నాటికి పది రోజుల్లో కొత్తగా 90 వేల కేసులు వచ్చాయి. దేశం మొత్తమ్మీద నమోదైన మరణాల్లో మూడింట ఒక వంతు మరణాలు కూడా గత పది రోజుల్లోనే నమోదయ్యాయి. దేశంలో తొలి కరోనా కేసు జనవరి 30న వెలుగుచూసింది. కేసుల సంఖ్య లక్షకు చేరుకోవడానికి వందకు పైగా రోజులు పట్టింది. మే 18న దేశంలో వైరస్ కేసులు లక్షకు చేరుకున్నాయి. మరో లక్ష కేసులు నమోదుకావడానికి 17 రోజుల సమయం మాత్రమే పట్టింది. కేసుల సంఖ్య పెరగడంతో టెస్టుల సంఖ్యను కూడా పెంచారు. ఇప్పటివరకు దాదాపు 51 లక్షల మంది నమునాలను పరీక్షించారు. రోజుకు లక్ష 50 వేలకు పైగా టెస్టులు నిర్వహిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ 15 రాష్ట్రాల్లోనే 2 లక్షల 65 వేలకు పైగా కేసులు ఉన్నాయి. ఈ 15 రాష్ట్రాల్లోనే 3, 300 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, తమి ళనాడు, ఢిల్లీ, గుజరాత్‌లలో వైరస్ విజృంభిస్తోంది. ఈ నాలుగు రాష్ట్రాల్లోనే లక్ష 86 వేల మంది కరోనా బాధితులున్నారు. 5 వేల ఒక వంద మంది చనిపోయారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ విధ్వంసమే సృష్టిస్తోంది. ఈ ఒక్క రాష్ట్రంలోనే సుమారు 95 వేల కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇది, దేశం మొత్తమ్మీద నమోదైన కేసుల్లో దాదాపు 30 శాతం. అలాగే, 45 శాతం కరోనా మరణాలు కూడా మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. స్వీడన్, దక్షిణాఫ్రికా, బెల్జియం, బంగ్లాదేశ్, చైనా కంటే కూడా మహారాష్ట్రలోనే ఎక్కువ మంది బాధితులున్నారు. త్వరలోనే కెనెడాను కూడా మహారాష్ట్ర అధి గమించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

