కరోనా పేషెంట్‌కు అరుదైన చికిత్స చేసిన ఎన్నారై

కరోనా పేషెంట్‌కు అరుదైన చికిత్స చేసిన ఎన్నారై

అమెరికాలో కరోనాతో బాధపడుతున్న ఓ యువతికి అరుదైన సర్జరీ చేశారు. ఆమె రెండు ఊపిరితిత్తులను మార్పిడి చేశారు. అయితే, ఈ ఆపరేషన్ చేసింది. భారత సంతతికి చెందిన వైద్యుడు కావడం గమనార్హం. అంకిత్ భరత్ నేతృత్వంలో షికాగోలోని నార్త్ వెస్ట్రన్ మెమోరియల్ హాస్పిటల్‌లో ఈ శస్త్రచికిత్స జరిగింది. కరోనా పేషెంట్ కు ఈ రకమైన సర్జరీ చేయడం ఇదే తొలిసారి. తాను చేసిన ఆపరేషన్‌లలో ఇది చాలా కష్టతరమైనదని అంకిత్ భరత్ అన్నారు. ఇంకా, ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ శ్వాస కోశ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని.. దీని వలన మూత్రపిండాలు, రక్తనాళాలు, నాడీ వ్యవస్థపై పడి.. వాటి పనితీరు దెబ్బతింటుందని అన్నారు. కరోనా పేషెంట్లు కోలుకోవాలంటే.. ఇది ఒక్కటే సరైన మార్గమని అన్నారు. ఆమెకు ఆపరేషన్ చేసి.. వెటిలేటర్ మీద పెట్టామని.. ఆమె కోలుకోవడానికి చాలా సమయంపడుతోందని అన్నారు. ఊపిరితిత్తుల మార్పిడి మాత్రమే ఆమెకు ఉన్న ఆప్షన్ గా మారిందని.. అందుకే అలా చేయాల్సి వచ్చిందని అన్నారు. అయితే, ఆమెకు కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన తరువాతే ఆపరేషన్ చేశామని ఆయన స్పష్టం చేశారు. కరోనా పేషెంట్ల విషయంలో వైద్యులు ఈ సర్జరీపై దృష్టిపెట్టాలని అన్నారు.

అయితే, వైద్యులు ఆమె వ్యక్తిగత వివరాలు మాత్రం వెల్లడించలేదు. నార్త్ కరోలినా నుంచి ఉద్యోగం కోసం షికాగో తరలి వచ్చిందని ఆమె గురించి తెలిపారు. ఏప్రిల్ 26న కరోనాతో ఆస్పత్రిలో చేరిందని.. అయితే, అప్పటికే ఆమె రెండు వారాల నుంచి అనారోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ముందుగా ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందించామని.. తరువాత రక్తంలోకి నేరుగా ఆక్సిజన్ అందించామని తెలిపారు. అయితే అలా ఎన్ని వారాలు గడిచినా ఆరోగ్యం కుదుటపడలేదని వైద్యులు తెలిపారు. చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడటంతో ఆమె చాతి కండరాలు బలహీనంగా మారి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని గ్రహించి ఈ రకమైన సర్జరీ చేయాల్సి వచ్చిందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story