జర్నలిస్టు మనోజ్‌ కుటుంబానికి కోటి రూపాయల భీమా ఇవ్వాలి: ఆర్ కృష్ణయ్య

జర్నలిస్టు మనోజ్‌ కుటుంబానికి కోటి రూపాయల భీమా ఇవ్వాలి: ఆర్ కృష్ణయ్య

కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టు మనోజ్ కుమార్ కుటుంబానికి కోటిరూపాయల భీమా ప్రకటించాలన్నారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. విద్యానగర్ లోని బీసీ సంఘం కార్యాలయంలో మనోజ్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో పేదప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని ఆయన విమర్శించారు.గాంధీలో కరోనా చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మనోజ్ మృతిచెందాడని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. మనోజ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం, కోటి ఆర్ధిక సహాయం అందించాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story