తెలంగాణలో భారీగా కరోనా కేసులు.. ఒక్కరోజే 253 మందికి పాజిటివ్

తెలంగాణలో భారీగా కరోనా కేసులు.. ఒక్కరోజే 253 మందికి పాజిటివ్

తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 253 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 4,737కి చేరింది. అటు ఒక్కరోజు 8మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 180కి చేరింది. ఇప్పటి వరకూ 2,352 మంది కరోనా నుంచి కోలుకోగా.. 2,203 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 179 నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story