రష్యాలో విజృంభిస్తున్న కరోనా.. రోజుకి 8 వేల పాజిటివ్ కేసులు..

రష్యాలో విజృంభిస్తున్న కరోనా.. రోజుకి 8 వేల పాజిటివ్ కేసులు..
X

ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 8,706 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ లో వైరస్ సోకి 2,700 మందికి పైగా మరణించారు. గడిచిన 24 గంటల్లో 114 మంది మరణించడంతో మరణాల సంఖ్య 6,829కు చేరింది. యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్ తరువాత ప్రపంచంలో కరోనా పాజిటివ్ కేసుల్లో రష్యా మూడవ స్థానంలో ఉంది. మొత్తం బాధితుల సంఖ్య 5,20,129 కి చేరుకుంది. కోలుకున్న వారి సంఖ్య 2,74,641.

Tags

Next Story