కరోనా కేసుల కట్టడికి 48 గంటలు లాక్డౌన్

కరోనా కేసుల కట్టడికి 48 గంటలు లాక్డౌన్
X

దాదాపు రెండు నెలలకు పైగా లాక్డౌన్ విధించినా ఉపయోగం లేకుండా పోయింది. కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మళ్లీ ఒకసారి లాక్డౌన్ చేస్తే మంచిదేమో అని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. యూపీలోని మీరట్ లో కరోనా మరింతగా వ్యాపిస్తుండడం అధికారులను కలవరానికి గురిచేస్తోంది. వైరస్ ని అంతమొందించేందుకు వారంలో రెండు రోజులు అంటే 48 గంటల పాటు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించనున్నట్లు డీఎం అనిల్ డీంగరా తెలిపారు. ప్రజలు మాస్కులు పెట్టుకోకుండా బయటకు వస్తే కఠిన చర్యలు అవలంభిస్తామని హెచ్చరించారు. జిల్లాలో కరోనా ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా షాపు యజమానులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల పరిరక్షణే ధ్యేయంగా లాక్డౌన్ తప్పనిపరిస్థితి అని వివరించారు.

Tags

Next Story