రాష్ట్రంలో ఒకరి తర్వాత ఒకరు.. కరోనా బారిన పడుతున్న ఎమ్మెల్యేలు

రాష్ట్రంలో ఒకరి తర్వాత ఒకరు.. కరోనా బారిన పడుతున్న ఎమ్మెల్యేలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో సామాన్య ప్రజల్నే కబళించిన కరోనా తాజాగా ఎమ్మెల్యేలను పట్టి పీడిస్తోంది. ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు పాజిటివ్ రాగా.. సోమవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు వైరస్ సోకినట్లు తెలిసింది. దీంతో వైరస్ సోకిన ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరింది. ఇప్పటికే జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వైరస్ సోకగా ఆయన రెండు రోజుల పాటు హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని హోం క్వారంటైన్ కు వెళ్లారు.

ఇదిలా ఉండగా వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ కు కరోనా సోకింది. సోమవారం నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం గ్రేటర్ హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఒక్క రాజధానిలోనే పాజిటివ్ కేసుల సంఖ్య 3 వేలకు చేరుకుంది. ఇందులో మరణించిన వారి సంఖ్య 187. నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్ రావడంతో అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే గణేశ్ గుప్తా.. బాజిరెడ్డి గోవర్ధన్, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డిలను కలవడంతో ఆయనకు వైరస్ సోకింది. హైదరాబాద్ డీఎంహెచ్ వోలో పనిచేసే ఓ అధికారికి పాజిటివ్ వచ్చింది.

హైదరాబాద్ లోని పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రిలోని వైద్య సిబ్బందిలో సగం మందికి వైరస్ సోకడంతో హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న సిబ్బంది అత్యవసర కేసులు మినహా ఇతరులకు సేవలు అందించడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story