అసెంబ్లీ సమావేశాలకు నల్లచొక్కాలతో హాజరు కావాలని టీడీఎల్పీ నిర్ణయం

టీడీపీ నాయకులపై అక్రమ కేసులను నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాలకు నల్లచొక్కాలతో హాజరు కావాలని టీడీఎల్పీ నిర్ణయించింది. అసెంబ్లీ జరిగినన్ని రోజులు నల్ల చొక్కాలతోనే హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారు.
టీడీపీ నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని.. సమావేశంలో కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ సమావేశాలకు హాజరు కాకూడదని కొందరు నేతలు సూచించారు. అయితే, అసెంబ్లీకి వెళ్లకపోతే మండలిలో ప్రభుత్వం మరికొన్ని బిల్లులను ఆమోదించుకునే అవకాశం వుందని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. అవసరమైతే పరిస్థితిని బట్టి వాకౌట్ చేసి రావాలని కూడా కొందరు నేతలు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

