కరోనా విషయంలో కోర్టును ఆశ్రయించిన వ్యక్తికి రూ.5 లక్షల జరిమానా

కరోనా విషయంలో కోర్టును ఆశ్రయించిన వ్యక్తికి రూ.5 లక్షల జరిమానా
X

కరోనా బాధితులకు ఉచితంగా చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వ్యక్తికి గట్టి షాక్ తగిలింది. కరోనా కష్టకాలంలో ప్రజల దగ్గర ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కవ ఫీజులు వసూలు చేస్తున్నాయని సాగర్ జోంధాలే అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని కరోనా బాధితులకు ఉచితంగా చికిత్స అందించేలా ప్రభ్వుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అయితే, పిటిషనర్ డిమాండ్ అర్ధరహితమని దర్మాసనం మండిపడింది. అయితే, అక్కడితో ఆగకుండా పిటిషన్ కు 5 లక్షలకు జరిమాన విధించింది. నెలరోజుల్లో ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చేరాలని ఆదేశించింది.

Tags

Next Story