అంతర్జాతీయం

న్యూజిలాండ్‌పై మరోసారి పంజా విసిరిన కరోనా మహమ్మారి

న్యూజిలాండ్‌పై మరోసారి పంజా విసిరిన కరోనా మహమ్మారి
X

కరోనాను జయించిన దేశంగా ఇటీవల న్యూజిలాండ్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే, అక్కడ కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. తాజాగా రెండు కేసులు నమోదు కావడంతో అధికారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూకే నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిదని వైద్యులు తెలిపారు. దీంతో అధికారులు.. వారిద్దురూ ఎవరెవరితో కలిసారో వారిని కనిపెట్టే పనిలో పడ్డారు.

గత మూడు వారాల్లో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదవ్వకపోవడంతో.. న్యూజిలాండ్ కరోనా రహిత దేశంగా ప్రకటించుకుంది. ఇప్పుడు తాజాగా ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే, కరోనా పూర్తిగా కట్టడి చేయడం ఇప్పట్లో సాద్యం కాదని.. తాత్కాలికంగా మాత్రమే నిరోదించగలమని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

Next Story

RELATED STORIES