వైసీపీ నేతలను మరోసారి తీవ్రంగా విమర్శించిన రఘురామకృష్ణంరాజు

వైసీపీ నేతలను మరోసారి తీవ్రంగా విమర్శించిన రఘురామకృష్ణంరాజు
X

వైసీపీ నేతలు తనపై విమర్శలు చేయడంపై స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. మంత్రి పేర్నినానితో పాటు ఇతరులు తనపై ఆరోపణలు చేశారంటూ ఫైర్‌ అయ్యారు. సింహమే సింగిల్‌గా వస్తుందని, పందులే గుంపులా వస్తాయంటూ వైసీపీ నేతల్ని విమర్శించారు. కొట్టు సత్యనారాయణ ఓ ఇసుక దొంగ అంటూ ఆరోపించారు. ఇళ్లస్థలాలతో పాటు ఇసుక అక్రమాలకు పాల్పడ్డాంటూ మండిపడ్డారు. అతనితో పాటు నాగేశ్వరరావు సైతం తనపై విమర్శలు చేశారంటూ మండిపడ్డారు. ఇళ్లస్థలాల అక్రమాల్లో వీరి పాత్ర ఉందన్నారాయన. ఈ దొంగలంతా కలిసి ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు.

Tags

Next Story