ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్

ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్
X

ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. రెండు రోజుల క్రితం కరోనా లక్షణాలతో పరీక్షలు చేపించుకున్న సత్యేంద్ర జైన్‌కు నెగెటివ్ అని వచ్చింది. అయితే, బుధవారం కరోనా పాజిటివ్ అని రావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆయనకు రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆయన కోవిడ్ 19 వివరాలు అందించడానికి ప్రతీరోజు మీడియా సమావేశాలు పెట్టడంతో.. సమావేశాలకు హాజరైన మీడియా ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. గత వారం కేజ్రీవాల్ కు కూడా కరోనా లక్షణాలు కనిపించడంతో.. ఆయన హో క్వారంటైన్ కు వెళ్లారు. అయితే, ఆయనకు కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Tags

Next Story