కేరళలో చేస్తున్నారు కదా.. ఇక్కడెందుకు సాధ్యం కాదు: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

కేరళలో చేస్తున్నారు కదా.. ఇక్కడెందుకు సాధ్యం కాదు: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ప్రజలకు మహమ్మారిని గురించిన సమాచారం మరింతగా తెలియజేయండి. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించేలా చర్యలు తీసుకోండి అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేసులు, చికిత్సలకు సంబంధించిన వివరాలు ఒక్క మీడియా ద్వారానే కాకుండా స్థానిక పత్రికలతో పాటు ఆయా కాలనీల సంఘాలకు అందజేయాలని స్పష్టం చేసింది. తమ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందో ఆ వార్డు సభ్యులకు తెలియాల్సిన అవసరం ఉంది. మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ లను నిర్వహించలేమంటున్నారు.

కేరళలో సాధ్యమైంది ఇక్కడెందుకు సాధ్యం కాదని ప్రశ్నిస్తోంది కోర్టు. 10 రోజుల్లో 50 వేల పరీక్షలు నిర్వహించాలని టార్గెట్ పెట్టుకుంటే విస్తృతంగా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని కోర్టు తెలిపింది. రాష్ట్రంలో తగినన్ని పరీక్షలు నిర్వహించడం లేదని, వైద్య సిబ్బందికి తగినన్ని రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచడం లేదని దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఎదుర్కుంటున్న ఇబ్బందులు ఏమిటనేది కోర్టుకు వివరించాలని విచారణను 30కి వాయిదా వేసింది.

కోర్టు ప్రభుత్వం ముందుంచిన మార్గదర్శకాలు..

కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలి. దీనికి యాంటిజెన్ టెస్టింగ్ కిట్స్ ను వినియోగించాలి. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించాలి.

గాంధీ ఆస్పత్రి ఒక్కటనే కాకుండా కొవిడ్ టెస్టులు నిర్వహించే ప్రైవేట్ ఆస్పత్రుల జాబితానూ ప్రచురించాలి.

కేరళలో అనుసరిస్తున్నట్లు ఆర్ టీ-పీసీఆర్ పరీక్షలను నిర్వహించడానికి ఉన్న ఇబ్బందులేంటో చెప్పాలి.

పోలీసులకు, వైద్య సిబ్బందికి రక్షణ కిట్లను అందుబాటులో ఉంచాలి.

ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా సగం మంది వైద్య సిబ్బందితోనే పని చేయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

కొవిడ్ ఆస్పత్రులకు పోలీసు భద్రత కల్పించాలి.

Tags

Read MoreRead Less
Next Story