జీహెచ్ఎంసీ‌లో కరోనా విజృంభణ.. ఉద్యోగులకు కీలక సూచనలు

జీహెచ్ఎంసీ‌లో కరోనా విజృంభణ.. ఉద్యోగులకు కీలక సూచనలు

జీహెచ్‌ఎంసీని కరోనా వైరస్‌ వణికిస్తోంది. పారిశుధ్య కార్మికుల నుంచి జోనల్‌ కమిషనర్‌ వరకు కరోనా బాధితులే కావడం కలకలం రేపుతోంది. జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది జోనల్‌ ఆఫీస్‌ను శానిటైజ్‌ చేశారు. ఇక ఎల్బీజోన్‌లో సెక్షన్‌ ఆఫీసర్‌కు కరోనా నిర్ధారణ అయింది. ఇక ఇప్పటికే మేయర్‌ డ్రైవర్‌, అటెండర్‌కు కరోనా నిర్ధారణ అయింది. అటు, 20 మందికిపైగా పారిశుధ్య కార్మికులకు వైరస్‌ సోకింది. ఒక్క కాప్రా సర్కిల్‌లోనే 8 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే ఆఫీసుకు రావద్దని సూచించారు. ఆఫీసుల్లో ఉద్యోగులు ఎసీ, లిఫ్ట్‌, బయోమెట్రిక్‌ వాడవద్దన్నారు.

Tags

Read MoreRead Less
Next Story