రాష్ట్రంలో ప్రతి చెరువును నింపాలన్నదే కేసీఆర్ లక్ష్యం: కేటీఆర్

రాష్ట్రంలో ప్రతి చెరువును నింపాలన్నదే కేసీఆర్ లక్ష్యం: కేటీఆర్

రాబోయే వారం రోజుల్లో అర్హులైన ప్రతి రైతు అకౌంట్లో.. రైతుబంధు డబ్బులు పడాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఈ పథకాన్ని పక్కాగా అమలు చేసే బాధ్యతను సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తీసుకోవాలని కోరారు కేటీఆర్. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సూచించిన నియంత్రిత సాగు విధానానికి రైతుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి చెరువు, కుంటను నింపాలన్నదే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు కేటీఆర్.

జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. కొల్లమద్ది గ్రామంలో అప్పర్‌ మానేర్‌ ఫీడర్ చానల్‌లో ఉపాధి హామీ పథకం ద్వారా.. పూడికతీత పనుల్ని ప్రారంభించారు. అనంతరం నర్మాల గ్రామానికి చేరుకున్న మంత్రి 8 కోట్లతో మానేరు వాగుపై నిర్మించనున్న రెండు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఉప విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story