ఏపీలో కరోనా ఉగ్రరూపం.. 24 గంటల్లో 491 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.24 గంటల్లో ఏకంగా 491 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇదే అత్యధికం. రాష్ట్రంలోమొత్తం కేసులు 8 వేల 452కు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒకరు చనిపోయారు. దీంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య 101కి చేరింది. గత 24 గంటల్లో 22 వేల 371 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్రంలో కొత్తగా నమోదైన 491 పాజిటివ్ కేసుల్లో ఏపీకి చెందిన వారు 390 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రల నుంచి వచ్చిన 83 మంది, విదేశాల నుంచి వచ్చిన మరో 18 మంది కూడా వైరస్ బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 వేల 203 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మరో 3 వేల 316 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

