మిగతా రాష్ట్రాల కంటే ముందుగానే అప్రమత్తమయ్యాం: ఈటెల రాజేందర్

కరోనా విషయంలో రాష్ట్రప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేయడం సరికాదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వర్చువల్ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షడులు జేపీ నడ్డా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని.. అయితే, పరస్పర ఆరోపణకు ఇది సమయకాదని అన్నారు. జాతీయస్థాయి నయకులు ఇలా మాట్లాడటం సరికాదని ఈటెల మండిపడ్డారు. కరోనా ఒక్క తెలంగాణకు సంబంధించిన సమస్యకాదని.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇదే సమస్యతో సతమతమవుతున్నారని అన్నారు. గుజరాత్ లో కరోనా తీవ్రతపై ప్రధాని మోధీ బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో కమాండ్ కంట్రోల్ సెంట్రల్ ఏర్పాటు చేశామని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పర్యవేక్షిస్తుతున్నాని అని తెలిపారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారమే టెస్టులు జరుగుతున్నాయని.. తెలంగాణలో కరోనా టెస్టులు జరుగుతున్నాయని ఆరోపించడం సరికాదని అన్నారు. లాక్‌డౌన్ పూర్తిస్థాయిలో అమలు చేశామని.. మిగతా రాష్ట్రాల కంటే ముందుగానే.. కరోనా విషయంలో అప్రమత్తమయ్యామని ఈటెల తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com