గుడ్ న్యూస్.. ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులు పాస్

గుడ్ న్యూస్.. ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులు పాస్
X

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మొత్తం 6.3 లక్షల మంది టెన్త్‌క్లాస్‌ స్టూడెంట్స్‌ను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌, సప్లమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేశారు. ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులు కూడా పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు..సప్లమెంటరీ ఎగ్జామ్స్‌ కోసం ఇప్పటికే చెల్లించిన ఫీజు రీఫండ్ చేయనున్నారు.

పరీక్షల నిర్వహణ కోసం విద్యార్థుల తల్లిదండ్రులు, జిల్లాల కలెక్టర్లు, పోలీసుల, ఇతర విభాగాలు కలసి పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతమంది ఒకే చోట గుమిగూడటం అంత శ్రేయస్కరం కాదని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనను పరిగణలోకి తీసుకొని పరీక్షలు రద్దు చేయాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించారని మంత్రి సురేశ్‌ చెప్పారు.

తొలుత ఏపీలో జులై 10-17 వరకు పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 11 పేపర్లను ఆరుకు కుదించారు. భౌతిక దూరం పాటించడం కోసం పరీక్ష కేంద్రాలు కూడా రెట్టింపు చేశారు. శానిటైజర్లు, థర్మల్ స్కానర్,లు మాస్కులు సిద్ధం చేశారు. కానీ పరిస్థితి అదుపులో లేకపోవడంతో పరీక్షలు రద్దు చేశారు.

Tags

Next Story