కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు

కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు

కల్నల్ సంతోష్‌బాబు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సంతోష్‌ తండ్రి ఉపేందర్‌తో మాట్లాడారు. దేశం కోసం ప్రాణాన్నే త్యాగం చేసిన ధన్యజీవి సంతోష్‌ అని కొనియాడారు. అమర వీరుడి ఆత్మత్యాగం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు చంద్రబాబు.

అటు, తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌ రెడ్డి కూడా కల్నల్ సంతోష్‌ బాబు కుటుంబాన్ని పరామర్శించారు. సూర్యాపేట వాసి కల్నల్ స్థాయికి ఎదగడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు.. విధి నిర్వహణలో వీరమరణం పొందిన ఆయన సేవల్ని దేశం మరిచిపోదని అన్నారు చాడా వెంకట్‌రెడ్డి.

Tags

Read MoreRead Less
Next Story