కరోనా వస్తే టెన్షన్ వద్దు.. నాకూ వచ్చింది.. ఇమ్యూనిటీ పెంచుకోండి ఈ విధంగా: న్యూట్రిషనిస్ట్ శిల్పారెడ్డి

నిన్నటి వరకు కరోనా వస్తుందేమో అని భయం. కానీ ఇప్పుడు వచ్చినా భయపడాల్సిన పన్లేదు అంటున్నారు మోడల్, ఫ్యాషన్ డిజైనర్, న్యూట్రిషనిస్ట్ అయిన శిల్పారెడ్డి. కొద్ది రోజుల క్రితం ఆమె కూడా కరోనా బారిన పడ్డారు. రెండు వారాల క్రితం వాళ్లింటికి ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చారని ఆయన ద్వారా తనకు, తన భర్తకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. కరోనా లక్షణాలేవీ కనబడలేదు అయినా పాజిటివ్ వచ్చింది. దాంతో హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. కరోనా గురించి లేని పోని అపోహలేవీ పెట్టుకోవద్దని టెన్షన్ పడకుండా జాగ్రత్తలు తీసుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే సరిపోతుందని అన్నారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం ఓ వీడియోని షేర్ చేశారు.
అసలు కరోనా రాకుండానే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.. ప్రతి ఒక్కరూ రోజూ ఆహారం ద్వారా కానీ టాబ్లెట్ రూపంలో కానీ 1000 మిల్లీ గ్రాముల సీ విటమిన్.. 100 మిల్లీగ్రాముల జింక్ (రాత్రి పూట) ఒక ప్రోబయోటిక్ క్యాప్సూల్ తీసుకోవాలని తెలిపారు. శరీరానికి అసరమైన డీ విటమిన్ అందుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఉదయం పూట శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. డే అంతా గోరు వెచ్చని నీళ్లు తాగుతుండాలి. గ్లాసు గోరు వెచ్చని నీటిలో కొన్ని పుదీనా ఆకులు లేదా తులసి ఆకులతో పాటు చిటికెడు పసుపు కలుపుకుని రోజుకి మూడు నాలుగు సార్లు పుక్కిలిస్తుండాలి. దాంతో పాటు చిటికెడు మిరియాల పొడిలో అంతే మోతాదులో పసుపు కలిపి చేసిన ఉండలను ప్రతి రోజు రెండు తీసుకోవాలన్నారు. తరచు ముక్కు, గొంతు శుభ్రపరుచుకోవాలన్నారు.
రోజుకి రెండు సార్లు ఆవిరి పట్టాలన్నారు. ముక్కు ద్వారా 20 - 25 సార్లు, నోటి ద్వారా 20 - 25 సార్లు శ్వాస తీసుకోవాలన్నారు. ప్రతి రోజు చిన్న చిన్న వ్యాయామాలైనా తప్పక చేయాలన్నారు. చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటే మేలు అని చెప్పారు. చేతులను సబ్బుతో వీలైనన్ని సార్లు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. చక్కెరను పూర్తిగా మానేయడం మంచిదని తెలిపారు. వాతావరణం మారినందున డాక్టర్ సలహాతో ఫ్లూకి సంబంధించిన మెడిసిన్ తీసుకోమంటున్నారు. అలానే కరోనా వైరస్ బారిన పడకుండా ఓ పానీయాన్ని ఇంట్లోనే తయారు చేసుకొని గోరు వెచ్చగా తాగాలని చెప్పారు. దాని తయారీ విధానం..
వెల్లుల్లి రెబ్బలు-5, లవంగాలు-8, తులసి ఆకులు-15, వాము-1 స్పూన్, పుదీనా ఆకులు-5, నల్ల మిరియాలు-10. వీటిని బాగా దంచి 6 కప్పుల నీరు పోసి మరిగించాలి. నీళ్లు మరిగి 3 కప్పులు అయిన తరువాత దించి ప్లాస్క్ లో పోసుకుంటే రోజు మొత్తం కొద్ది కొద్దిగా తీసుకోవచ్చని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com