మాంసం, చేపలకు కొన్నాళ్లు దూరంగా ఉంటే మంచిది: డాక్టర్ లీ ల్యాన్ జువాన్

మాంసం, చేపలకు కొన్నాళ్లు దూరంగా ఉంటే మంచిది: డాక్టర్ లీ ల్యాన్ జువాన్
X

తడి ప్రదేశాలు వైరస్ వ్యాప్తి కారకాలు. అందునా ఈ కరోనా వైరస్ మైనస్ 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద 20 ఏళ్లకు పైగా బతికి ఉండే అవకాశాలు ఉన్నాయని చైనా దేశ వైద్య నిపుణురాలు లీ ల్యాన్ జువాన్ పేర్కొన్నారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో కరోనా దశాబ్దాల పాటు జీవించి ఉంటుందని తెలిపారు. కొవిడ్ నిపుణుల బృందంలో ఒకరైన లీ స్థానిక మీడియాతో మాట్లాడుతూ శీతల పరిస్థితులను తట్టుకోగలిగే శక్తి కరోనాకు ఉన్నందున అది దేశాల మధ్య సులభంగా వ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడ్డారు. మాంసాన్ని దీర్ఘకాలం పాటు నిల్వ చేసే సీ ఫుడ్ మార్కెట్లలో వైరస్ ఆనవాళ్లు బయటపడినందున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇక నిల్వ చేసిన ఆహార పదార్థాల నుంచి, మాంసం మార్కెట్ల నుంచి కరోనా వ్యాపిస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో కొన్నాళ్లపాటు మాంసం, చేపలు తినకుండా ఉంటే మంచిదని చైనా నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి సీ ఫుడ్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న దాఖలాలు లేకపోయనప్పటికీ ముందు జాగ్రత్త కోసమని ఆమె స్పష్టం చేశారు. నీళ్లు తాగిన ప్రతిసారి గోరు వెచ్చని నీళ్లు తాగమని చెబుతున్నారు. ఆహారం వేడిగా తినమంటున్నారు. అదే విధంగా కూరగాయలు కట్ చేసే చాపింగ్ బోర్డును శుభ్రంగా వేడినీటితో కడగాలని చెబుతున్నారు. కట్ చేసే ముందు, చేసిన తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.

Tags

Next Story