కరోనా వచ్చిన ఫ్రెండ్ కి సమంత ముద్దు.. ఫ్యాన్స్ టెన్షన్!!

కరోనా వచ్చిన ఫ్రెండ్ కి సమంత ముద్దు.. ఫ్యాన్స్ టెన్షన్!!

స్టార్ హీరోయిన్ సమంతకి స్నేహితురాలు శిల్పారెడ్డి. ఆమె మోడల్, న్యూట్రిషియనిస్ట్. నిన్ననే ఆమె తనకి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. భయపడాల్సింది ఏమీ లేదు.. ఇమ్యూనిటీని పెంచుకుంటే సరిపోతుంది అంటూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఏమేం పదార్థాలు తీసుకోవాలి అని ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే ఆమెకి పాజిటివ్ అని తెలియక ముందు రెండు రోజుల క్రితమే శిల్ప.. సమంతను కలిశారు. సమంత ఆమెను ముద్దు పెట్టుకుని ఆ ఫోటోను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. దీంతో సమంతకు కూడా కరోనా వచ్చి ఉంటుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో నిర్మాత బండ్ల గణేష్ కి కరోనా వచ్చి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం సమంత సంగతి ఏంటని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ వార్తలపై సమంత స్పందించాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story