భాగ్యనగర వాసులను కలవరపెడుతున్న కరోనా.. 80 శాతం కేసులు ఇక్కడే..

భాగ్యనగర వాసులను కలవరపెడుతున్న కరోనా.. 80 శాతం కేసులు ఇక్కడే..

తెలంగాణ రాష్ట్ర రాజధానిపై కరోనా పగబట్టినట్లుంది. కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయే కానీ తగ్గే సూచనలేవీ కనిపించట్లేదు. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. రాష్ట్రంలో నమోదైన కేసులు 7.802 అయితే ఒక్క హైదరాబాదులోనే 4,868 పాజిటివ్ కేసులు ఉండడం అధికారులను ఆందోళనకు గురి చేస్తుంది. కరోనా మరణాల్లో కూడా ఒక్క హైదరాబాదులోనే 80 శాతం నమోదవడం పరిస్థితి తీవ్రతను వివరిస్తుంది. ఆసిఫ్ నగర్, బంజారాహిల్స్, గోషామహల్, పంజాగుట్ట ప్రాంతాల్లో కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి.

లాక్డౌన్ అమలుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా హైదరాబాద్ లో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లాక్డౌన్ అనంతరం కేసుల సంఖ్య పెరిగింది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా, ప్రజల సహకారం ఉంటేనే సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడం కోసం కంటైన్మెంట్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికే 154 కంటైన్మెంట్ ప్రాంతాలు ఉన్నాయి. కాగా, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కరోనా టెస్ట్ చేయించుకోవచ్చు అని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కరోనా అనుమానంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో టెస్ట్ చేయించుకోవాడినికి నగరానికి వస్తున్నారు. దాంతో ఆస్పత్రులన్నీ కరోనా అనుమానితులతో రద్దీగా ఉన్నాయి. గాంధీ ఆస్సత్రిలో, ప్రకృతి వైద్యశాలలో, ప్రైవేటు ఆస్పత్రులలో కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో బెడ్స్ ఖాళీగా లేవు. దీంతో ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని అంచనా వేయడం కష్టంగా మారింది.

Tags

Next Story