ఆ తొమ్మిది రాష్ట్రాల్లో రాకపోకలు బంద్..

ఆ తొమ్మిది రాష్ట్రాల్లో రాకపోకలు బంద్..

ఇప్పుడిప్పుడే అగ్రరాజ్యం అమెరికా కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటోంది. ఈ సమయంలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తే మరింత ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని, దాన్ని నివారించాలంటే రాకపోకలు నిరోధించడం ఒక్కటే మార్గమని తలుస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. అమెరికా రాష్ట్రాలు న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల గవర్నర్ లు తమ ప్రజలను ఆదేశించారు. నార్త్ కరినా, సౌత్ కరోలినా, అలబామా, ఆర్కన్సాస్, ఫ్లోరిడా, వాషింగ్టన్, టెక్సాస్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

కరోనా తీవ్రత ఆయా రాష్ట్రాలో ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నాయి ప్రభుత్వాలు. నిన్న మొన్నటి వరకు న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. పరిస్థితులు కాస్త కుదుట పడుతున్న సమయంలో మళ్లీ రిస్క్ తీసుకోవద్దని భావిస్తున్నాయి. భారత కాల మానం ప్రకారం గురువారం సాయింత్రం నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి ఉంటే 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని ముందుగానే హెచ్చరించారు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినట్లైతే వెయ్యి డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story