తెలంగాణలో బుధవారం భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదు

తెలంగాణలో బుధవారం భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదు
X

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ రికార్డ్ స్థాయిలో నమోదవుతూనే ఉన్నాయి. బుధవారం ఒక్కరోజే పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 891 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం. ఒక్క ghmc పరిధిలోనే బుధవారం 719 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిసి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,444కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5858గా ఉన్నాయి. గత 24 గంటల్లో 137 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4,361కు చేరింది. బుధవారం ఒక్కరోజే కరోనా బారిన పడి ఐదుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 225కి చేరింది.

Tags

Next Story