అమెరికా బలగాలను హతమార్చేందుకు రష్యా కుట్ర?

అమెరికా బలగాలను హతమార్చేందుకు రష్యా కుట్ర?

అమెరికా నిఘా వర్గాలు.. రష్యాపై తీవ్ర ఆరోపలణలు చేశాయి. ఆఫ్గనిస్తాన్‌లో ఉన్న అమెరికా సైనికులను హతమార్చేందుకు తాలిబన్ గ్రూపులతో సంబంధం ఉన్న ఉగ్రవాదులకు రష్య మిలటరీ సుఫారీ అందించిందని అంటుంది. ఇస్లామిక్ ఉగ్రవాదులకు ఇప్పటికే కొంత డబ్బు కూడా అందినట్టు తమ దగ్గర సమాచారం ఉందని తెలిపాయి. న్యూయార్క్ టైమ్స్ లో ఈ కథనం వెలువడింది. అమెరకాతో పాటు ఆప్గన్ లోని సంకీర్ణ, పాశ్చాత్య బలగాలను హతమార్చేందుకు రష్య కుట్రలు చేస్తోందని తెలిపింది. గత ఏడాది ఉగ్రవాదులతో పోరాడి.. 20 మందికి పైగా అమెరికా సైనికులు మరణించిన విషయం తెలిసిందే. అయితే, వీరి మరణం వెనుక కూడా రష్యా కుట్ర ఉందా లేదా అనేది దానిపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.

అయితే, ఈ విషయంపై అమెరికా ప్రభుత్వ మీడియా కానీ, శ్వేతసౌధం కానీ ఇప్పటి వరకూ స్పందదించలేదు. ఓ వైపు అగ్రరాజ్యం.. తాలిబన్లతో శాంతి చర్చలు జరుపుతుంది. మరోవైపు ఇలాంటి ఆరోపణలు రావటం తెరపైకి వస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story