ఆస్ట్రేలియా - ఇండియా మధ్య ఎయిర్ ఇండియా విమానాలు

ఆస్ట్రేలియా - ఇండియా మధ్య ఎయిర్ ఇండియా విమానాలు
X

లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని వందే భారత్ మిషన్ కింద ప్రభుత్వం స్వదేశానికి తీసుకొని వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలో చిక్కుకున్న వారిని భారత్ తీసుకొచ్చేందుకు జూలై 1 నుంచి జూలై 14 వరకూ 8 ఎయిర్ ఇండియా విమానాల పంపించనున్నారు. ఈ నెల 28 నుంచి బుకింగ్ కూడా ప్రారంభమవుతుంది. నాలుగు విమానాలు సీడ్నీకి, నాలుగు విమానాలు మెల్‌బోర్న్‌కి వెళ్తున్నాయని.. అయితే టికెట్లు బుక్ చేసుకునేవారు ఎయిర్ ఇండియా వెబ్ సైట్ లోనే బుక్ చేసుకోవాలని ప్రకటించారు. వందే భారత్ మిషన్ లో భాగంగా ఎయిర్ ఇండియా మే 7 నుంచి అంతర్జాతీయ విమానాలు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి మే7 నుంచి జూన్ 1 వరకూ 423 అంతర్జాతీయ విమానాల్లో 58,867 మంది భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చాయి.

Tags

Next Story