కోటి దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

కోటి దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా స్వైర విహారం చేస్తోంది. కరోనా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకీ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటింది. ఇందులో 25 శాతానికి పైగా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి.

శనివారం అర్ధరాత్రికి ప్రపంచవ్యాప్తంగా 1,00,00,051 కేసులు నమోదయ్యాయి. ఇక ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 4,98,950కు చేరింది. మొత్తం కేసులు, మరణాల్లో సగానికిపైగా అమెరికా, బ్రెజిల్‌, రష్యా, భారత్‌, బ్రిటన్‌లోనే చోటు చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తొలి లక్ష కేసులు నమోదు కావడానికి 65 రోజుల సమయం పట్టింది. ప్రస్తుతం రోజూ సగటున 1.94 లక్షల కొత్త కేసులు వెలుగులోకి రావటంతో.. ప్రజలు ఆందోళనకు గురువతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story