కరోనాలో కనిపించే మరో మూడు కొత్త లక్షణాలు..

కరోనాలో కనిపించే మరో మూడు కొత్త లక్షణాలు..

సాధారణంగా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకు సంబంధించి సమస్యలు వస్తే అవి కరోనాకు సంబంధించినవి. ఈ లక్షణాలున్నవారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా సోకినప్పటికీ.. ఈ లక్షణాలేమీ కనిపించని వారిలో విరేచనాలు, జీర్ణ సంబంధిత లక్షణాలు, ఆకలి లేకపోవడం వంటివి కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి కూడా కరోనా సోకవడం వల్లే వస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, తలనొప్పి, రుచి, వాసన గుర్తుపట్టకపోవడం, గొంతు మంట, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఇవన్నీ కూడా కరోనా లక్షణాలే అని డాక్టర్లు చెబుతున్నారు.

అయితే తాజాగా కరోనాలో మరో మూడు కొత్త లక్షణాలను చేర్చింది అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. కరోనా వైరస్‌ లక్షణాలకు సంబంధించి హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కీలక ప్రకటన చేసింది. వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం కూడా కరోనా లక్షణాలు అని తెలిపింది. ఈ లక్షణాలు వైరస్ సోకిన 2 నుంచి 14 రోజుల్లోపు కనిపిస్తాయని ఆ సంస్థ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story