అంతర్జాతీయం

కరోనా వ్యాక్సిన్ కోసం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో బ్రెజిల్ డీల్

కరోనా వ్యాక్సిన్ కోసం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో  బ్రెజిల్ డీల్
X

కరోనాకు మహమ్మారికి టీకా కనిపెట్టే పనిలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్రవేత్తలు, ఆస్ట్రాజెన్కా ఉన్నారు. ఈ రెండూ సంయుక్తంగా కలిసి పని చేస్తున్నాయి. ఇప్పటికే జంతువులపై క్లినికల్ ట్రైల్స్ పూర్తి చేశారు. ఇందులో మంచి ఫలితాలు వచ్చాయి. ఇక, మనుషులపై ట్రైల్స్ కు అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇది కూడా విజయవంతం అయితే, ఈ ఏడాది చివరికి మెడిసిన్ మార్కెట్ లోకి వస్తుంది. అయితే, బ్రెజిల్ ప్రభుత్వం ఇదే టీకాలను తమ కోసం సిద్ధం చేయాలని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్రవేత్తలు, ఆస్ట్రాజెన్కాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలి విడతలో 3 కోట్ల డోసుల టీకాలు ఉత్పత్తికి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఈ మొత్తం ఒప్పందం విలువ 127 మిలియన్ డాలర్లు అని బ్రెజిల్ ప్రభుత్వం తెలిపింది. అయితే, ఈ డీల్ లో కొంత రిస్క్ కూడా ఉందని తెలిపింది. జంతువులపై మంచి ఫలితాలు వచ్చిన.. ఈ టీకా మనుషుల ప్రయోగం చేసినపుడు విఫలమైనా.. అప్పటికే మరో కొత్త వ్యాక్సిన్ వచ్చినా.. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.

Next Story

RELATED STORIES