పాక్‌లో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు

X
ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య కోటి మార్కును దాటేసింది. మరణాలు ఐదు లక్షలు దాటాయి.
ఇప్పటికే 11 దేశాల్లో రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా పాకిస్థాన్ కూడా ఆ జాబితాలో చేరింది. ప్రపంచంలో రెండు లక్షల కేసులు దాటిన 12వ దేశంగా నిలిచింది. పాకిస్థాన్‌లో ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 4,098 మంది ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
