యోగా గురువు రాందేవ్ బాబాపై కేసు నమోదు

యోగా గురువు రాందేవ్ బాబాపై కేసు నమోదు
X

ఇటీవల కరోనాకు మెడిసిన్ ప్రకటించిన యోగా గురువు బాబా రాందేవ్ పై కేసు నమోదైంది. కరోనిల్ మాత్రలతో కరోనా తగ్గుతోందని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ.. జైపూర్ లోని జ్యోతినగర్ పోలీస్ స్టేషన్ లో బల్బీర్ జకర్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. బాబా రాందేవ్ తో పాటు పతంజలి సంస్థ సీఈవో బాలకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఇటీవల పతంజలి సంస్థ హరిద్వార్ లో కరోనాకు మెడిసిన్ ప్రకటిచింది. 150కి పైగా ఔషధ మొక్కలతో తాము కరోనిల్ మందు సిద్ధం చేశామని.. దీనిపై క్లినికల్ ట్రైల్స్ చేయగా.. వంద శాతం మంది పూర్తిగా కోరుకున్నారని రాందేవ్ బాబా తెలిపారు. దీనిపై స్పందిచిన కేంద్ర ఆయుష్ శాఖ.. క్లినికల్ ట్రైల్స్ వివరాలు తెలయజేస్తే.. ఈ మెడిసిన్ మార్కెట్ లోకి విడుదల చేయడానికి అనుమతిస్తామని తెలిపిన విషయం తెలిసిందే.

Tags

Next Story