వైరస్ బారిన పడుతున్న నేతలు.. హోం మంత్రికి కరోనా

వైరస్ బారిన పడుతున్న నేతలు.. హోం మంత్రికి కరోనా

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కొవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రికి రావడంతో ఆయనతో తిరిగిన వారందరినీ క్వారంటైన్ కు తరలిస్తున్నారు పోలీసులు. అలాగే హోంమంత్రి నివాస పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే కొవిడ్ బారిన పడిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్థన్ క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే 983 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 14,419కి చేరుకుంది. ఇందులో 9 వేల మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 247కు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story